టీజర్‌లో ఉల్లాలా ఉల్లాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలన్‌గా చిరపరిచితమైన సత్యప్రకాష్ మెగాఫోన్ పెట్టాడు. తన కుమారుడు నటరాజ్ కథానాయకుడిగా సుఖీభవ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఉల్లాలా ఉల్లాలా’. ఎ.గురురాజ్ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఓ అందమైన కథతో యువతరానికి కావలసిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. నాలుగు పాటలున్నాయని, ఓ పాటలో 600 కార్లు ఉపయోగించి చిత్రీకరించామని, ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఆ పాట అందిస్తుందని వారన్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని వారు తెలిపారు. తన తండ్రి దర్శకత్వంలో నటించడం సంతోషంగా వుందని, నటుడిగా పలు విషయాలు ఆయనవద్ద నేర్చుకున్నానని హీరో నటరాజ్ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సత్యప్రకాష్.