ఫ్రీ పబ్లిసిటీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని సందర్భాల్లో సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది. కావాలని చేసిన అంశంకావొచ్చు, అనుకోని అంశంపై అనూహ్యమైన రియాక్షన్స్ కావొచ్చు.. పబ్లిసిటీ మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు పతి పత్నీ ఔర్ వో -ప్రాజెక్టుకు అదే జరిగింది. పతి పత్ని ఔర్ వొ టైటిల్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కింది. ఈమధ్యే సినిమా టీజర్‌ను బయటకు వదిలారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన శృంగారానురాగాన్ని చర్చించే ఇతివృత్తమిది. ఆడియన్స్ మీద గట్టిగా ప్రభావం చూపే అంశాలను ఏరికోరి సినిమాలో పెట్టడంలాంటి పరిణామాలు నడుస్తున్న ప్రస్తుతం టైంలో -ఈ సినిమాలోనూ ‘మేరిటల్ రేప్’ పదాన్ని ప్రయోగించారు. భార్య, భర్త ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఇష్టం లేకుండా శృంగార సంసారం సాగిస్తే.. అది పెళ్లిచాటు అత్యాచారం కిందకు వస్తుందన్న చర్చ లేవనెత్తారు. మారిటల్ రేప్ పదంపై తీవ్రంగా స్పందించిన నెటిజనులు -ప్రాజెక్టుపై విరుచుకుపడ్డారు. నెటిజనుల ట్రోలింగ్ పీక్స్‌కు చేరడంతో -హీరోయిన్ భూమి ఫడ్నేకర్ వివాదానికి తెరదింపే ప్రయత్నం చేసింది. ‘ఆ విషయంలో సారీ చెబుతున్నా’ అంటూ.. ఆ పదం వాడటం వెనుక ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఆమె కామెంట్లపైనా నెటిజనులు తీవ్ర వ్యక్తరేకత వ్యక్తం చేశారు. హీరోయిన్ తప్పొప్పుకుంటే సరిపోతుందా? దర్శక నిర్మాతలేమయ్యారు అంటూ కామెంట్లు ఉధృతమయ్యాయి. ‘మారిటల్ రేప్’పై చిత్రబృందం ఎలా రియాక్టవుతుందో క్లారిటీ లేదుగానీ, ఇష్యూ మాత్రం ప్రాజెక్టుకు ఫ్రీ పబ్లిసిటీ తెస్తోంది.