అన్ని పాటలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో, భారీ చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా సమయం పడుతోందట. వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా షూటింగ్ ముగించే ఏర్పాట్లలో దర్శకుడు తలమునకలై ఉన్నాడు. ఉత్కంఠ రేపే హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతోపాటు అందరికీ ఇష్టమైన పాటలు కూడా ఈ సినిమాలో దాదాపు 7 ఉంటాయని సమాచారం. దేశభక్తితో సాగే పాటలు, చరణ్-అలియాభట్‌లమధ్య వచ్చే రెండు రొమాంటిక్ పాటలు, ఎన్టీఆర్‌తో కొన్ని పాటలు కలిపి మొత్తం 7 నుండి 8 పాటలదాకా ఉంటాయని టాలీవుడ్ సమాచారం. దేశభక్తి ప్రధానంగా సాగే పాటలను సుద్దాల అశోక్ తేజ రాశారట. ఇక సంగీత దర్శకుడు కీరవాణి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!