ఇక ఫుల్‌టైమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలంతా సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నారు. హీరోగా షూటింగ్‌లు, నిర్మాతగా ప్రొడక్షన్స్ చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. సొంత బ్యానర్లపైనే సినిమాలు చేస్తూ, సరికొత్త స్టామినా చూపిస్తోన్న కుర్ర దర్శకులకూ అనేక విధాల అవకాశాలిస్తున్నారు. ఈ విషయంలో కాస్త నిదానంగావున్న నేచురల్ స్టార్ నాని సైతం -నిర్మాతగా బిజీ అయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట. ‘అ!’ చిత్రంతో వావ్ అనిపించుకున్న నాని, ఇప్పుడిక ఇతర నిర్మాతలతో భాగస్వామ్య చిత్రాలూ రూపొందించడానికి సిద్ధమవుతున్నాడట. దిల్‌రాజు- నాని మధ్య నిర్మాణ భాగస్వామ్య ఒప్పందానికి బాటల పడ్డాయన్న వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. టై అప్ డీల్‌లో భాగంగానే నాని హీరోగా రెండు ప్రాజెక్టులు రూపొందించేందుకు సన్నాహాలు సాగుతున్నాయని అంటున్నారు. రెండు ప్రాజెక్టులకూ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, విక్రమ్ కె కుమార్‌లను దర్శకులుగా ఎంపిక చేసుకున్నట్టూ కథనం వినిపిస్తోంది.