6న పానిపట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జునకపూర్, సంజయ్‌దత్, పద్మిని కొల్హాపురి, కృతిసనన్ ప్రధాన తారాగణంగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పీరియాడికల్ చిత్రం -పానిపట్. భారతదేశ చరిత్రలో పానిపట్టు యుద్ధానికున్న ప్రత్యేకతను సినిమాలో చర్చిస్తున్నారట. సునీతా గోవారికర్, రోహిత్ సీలాత్కర్ రూపొందిస్తున్న సినిమాలో మరఠా యోధుడు సదాశివ్‌రావుగా అర్జున్‌కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, అహ్మద్ అబు అలీగా సంజయ్‌దత్, పార్వతీబాయి కృతిసనన్ నటించడం విశేషం. ఇటీవల విడుదల చేసిన పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని సినిమా యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా సంజయ్‌దత్ బాడీ లాంగ్వేజ్ అబు అలి పాత్రకు నిండుదనం తెచ్చిందని, విజువల్స్, రికార్డింగ్స్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని యూనిట్ అంటోంది. హిస్టారికల్ విజువల్ వండర్‌గా రూపొందించిన సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది.