అంతొద్దు...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో రిజల్ట్ ప్రభాస్ టీంకి చాలా పాఠాలే నేర్పించింది. అందుకే -తదుపరి ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ పరుగులకు బలమైన బ్రేకులే వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి సినిమానూ భారీగా తీసుకుంటూపోతే, తరువాత వెనక్కి తగ్గే అవకాశాలే లేకుండా పోతాయన్న ఆలోచన చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. అంతర్జాతీయస్థాయి అతి అన్ని సినిమాలకూ వర్కౌట్ కాదన్న విషయాన్ని మెదళ్లలో నింపుకుని, కథకు తగిన కటౌట్‌తో యాక్షన్ చూపిస్తే చాల్లేనన్న నిర్ణయంతో ప్రభాస్ టీం అడుగులేస్తున్నారన్న చర్చ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తనతో ఫ్యూచర్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్న నిర్మాతలకూ ప్రభాస్ గట్టిగానే చెబుతున్నాడట. ప్రభాస్ చేస్తోన్న తాజా ప్రాజెక్టు -జాన్. 1965ల కాలంనాటి ప్రేమకథ. ఈ సినిమా కోసం విదేశాల్లో దాదాపు 40 భారీ సెట్స్ వేయాలనుకున్నారు. అయితే, తాజా పరిణామాల్లో ప్రాజెక్టు విషయంలో ప్రణాళికలు మారాయట. అక్కడెక్కడికో వెళ్లి అంత ఖర్చుతో సెట్స్ వేసేకంటే, అదేదో ఇక్కడే చేస్తే ఖర్చు బాగా కలిసొస్తుందన్న నిర్ణయంతో యూనిట్ ముందుకెళ్తోందన్న మాట వినిపిస్తోంది. ఇదీ ప్రభాసే సూచించటం విశేషం. హీరోయే చెప్పిన తరువాత నిర్మాతకేంటి బాధ. అందుకే, లోకల్‌గా సెట్లు వేసే పని యూనిట్ మొదలెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలు గొప్ప పాఠాలు నేర్పిస్తాయంటే ఇదే మరి.