యూత్ ఎంటర్‌టైనర్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో మరో హీరో అరంగేట్రం చేశాడు. మహేష్‌బాబు మేనల్లుడు, రాజకీయవేత్త గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్‌ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆదివారం కొత్త ప్రాజెక్టు పూజాకార్యక్రమంతో ప్రారంభమైంది. అమర్‌రాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రొడక్షన్ 1గా ఈ సినిమా రూపొందనుంది. హీరో అశోక్‌తో స్క్రీన్ రొమాన్స్‌కు నిధి అగర్వాల్ ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రారంభ కార్యక్రమంలో హీరో, నిర్మాత రామ్‌చరణ్ క్లాప్‌కొట్టాడు. సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించి హీరో అశోక్‌ని ఆశీర్వదించారు. భలేమంచిరోజు, దేవదాస్, శమంతకమణి చిత్రాల ఫేమ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. సినిమా ప్రారంభం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత గల్లా పద్మావతి మాట్లాడుతూ -అశోక్‌కి చిన్నప్పటి నుంచే నటనపట్ల ఆసక్తివుంది. ఆ ఆసక్తితోనే సూపర్‌స్టార్ కృష్ణ పండంటి సంసారం చిత్రంలో బాలనటుడిగా ఓ పాత్ర పోషించాడు. ఆ తరువాత మహేష్‌బాబు నాని సినిమాలోనూ బాలనటుడుగా కనిపించాడు. ఉన్నత చదువుల కోసం యుఎస్ పంపించినా -నటనపట్ల ఆసక్తి చూపించటంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్సు చేయించాం. బాల నటుడిగా దర్శకుల మెప్పు పొందడంతో అదే అశోక్ మనసులో నాటుకుపోయిందని గ్రహించి సినిమావైపు ప్రోత్సహిస్తున్నాం. ఒక మంచి సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు ఇంట్రొడ్యూస్ అవుతుండటం తల్లిగా నాకు హ్యాపీగా ఉంది అన్నారు. తమ కుటుంబాలకు అండగా నిలిచిన అభిమానులు అశోక్‌ను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. జయదేవ్ గల్లా మాట్లాడుతూ -అమర్‌రాజా పేరిట ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశామని, దీనిపై ఇక వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రకటించారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ -ఇదొక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ. సరికొత్త జోనర్‌లో తెరకెక్కనున్న చిత్రం. డిసిప్లిన్డ్ పర్సన్‌గా అశోక్ యాటిట్యూడ్ చూసి సినిమా చేయానికి ముందుకొచ్చాను. అశోక్ మంచి ఆర్టిస్ట్‌గా ఎదగడమే కాదు, డెబ్యూ మూవీలోనే తన పెర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తాడని నమ్మకంగా చెబుతున్నా అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్టామినాపై నమ్మకంతో ఆయనతో సినిమాకు ఓకే చెప్పాను. రేపటినుంచే రెగ్యులర్ షూట్ మొదలుపెడుతున్నాం అన్నాడు. నరేష్, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తోన్న సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానా, సుధీర్‌బాబు, సుశాంత్, రమాదేవి, అరుణకుమార్, యూనిట్ టీం పాల్గొన్నారు. టాలీవుడ్‌కి మేనల్లుడు అశోక్ అరంగేట్రం చేస్తున్న సందర్భంగా స్టార్ హీరో మహేష్‌బాబు శుభాకాంక్షలు చెప్పాడు. ‘కష్టపడి పనిచెయ్. నువ్వు నేర్చుకున్నదంతా ఇవ్వు. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ సక్సెస్ సూత్రాన్ని మేనల్లుడికి బోధించాడు.