ప్రయోగాలంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు సూర్య. చేస్తున్న ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘24’. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 6న తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా సూర్యతో ఇంటర్వ్యూ..
‘24’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
ఈ టైటిల్ ఏమిటనే విషయంపై చాలామందికి క్యూరియాసిటీ వుంది. అదేంటో తెలియాలంటే ఈనెల 6 వరకూ ఆగాల్సిందే.
సైన్స్ ఫిక్షన్ కథంటున్నారు?
అవును. కథ చాలా విభిన్నంగా వుంటుంది. సైన్స్ ఫిక్షన్ తరహాలో ఇండియాలో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. కాబట్టి ఎక్కువమంది ఈ దిశగా ఆసక్తి చూపరు.
కథ గురించి?
కథ గురించి చెప్పేస్తే సినిమా మొత్తం తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఇదొక ప్రయోగాత్మక చిత్రమని చెప్పాలి. చాలామంది విభిన్నమైన కానె్సప్టులతో తమిళంలోనే ఎక్కువ సినిమాలు వస్తుంటాయని అంటుంటారు. కానీ, తెలుగులోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. విభిన్నమైన కానె్సప్టులతో వచ్చిన ‘శంకరాభరణం’, ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచాయి. అలాగే సైన్స్ ఫిక్షన్ కథతో కూడా అప్పట్లోనే సింగితం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. అలాగే ‘మిస్టర్ ఇండియా’ లాంటి సినిమాలు ఇండియన్ సినిమా స్టాండర్డ్‌ను పెంచాయి. హాలీవుడ్
సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా భారతీయ సినిమాలు కూడా వస్తాయని నిరూపించారు. అలాగే ‘మనం’ సినిమా కూడా భిన్నమైన కానె్సప్టే. కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ హైలెట్స్..?
ఈ సినిమాకు అంతటా పాజిటివ్ వైబ్రేషన్‌తో జరుగుతుంది. అలాగే, మంచి టెక్నీషియన్లు కూడా పనిచేశారు. ముఖ్యంగా రెహమాన్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. రీరికార్డింగ్ కూడా బాగుంది. విక్రమ్ కుమార్ టేకింగ్, ఆయన కంటెంట్ హైలెట్‌గా నిలుస్తాయి.
నిర్మాతగా మారడానికి కారణం?
‘మనం’ సినిమా తరువాత విక్రమ్ మా కజిన్ జ్ఞాన్‌వేల్‌తో కలిసి నా దగ్గరకు వచ్చాడు. నిజానికి ‘మనం’ సినిమాను నేను, తమ్ముడు కార్తి, నాన్నతో కలిసి చేయాలనే ఐడియా జ్ఞాన్‌వేల్‌ది. కానీ, విక్రమ్ రాగానే ‘మీకో కథ చెప్పాలి. నాకు 30 నిమిషాలు టైమ్ ఇవ్వండి’ అని అడిగాడు. ఆ తరువాత తను నాలుగున్నర గంటలపాటు కథ మొత్తం సీన్ బై సీన్ చెప్పాడు. ఎలాంటి పేపర్ కూడా అతని దగ్గర లేకుండా కథ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పడంతో షాక్ అయ్యాను. ముఖ్యంగా కథ బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు రావాలంటే మనమే డేర్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతగా మారాను. దానికోసం టెక్నీషియన్లు కూడా సరైన వాళ్ళు కావాలని చేసిన ప్రాజెక్టు ఇది.
ఇందులో మీకు నచ్చిన పాత్ర?
సినిమాలో మూడు పాత్రలుంటాయి. అందులో నాకు ఆత్రేయ పాత్ర బాగా నచ్చింది. జనాల్ని కూడా మెస్మరైజ్ చేసేలా వుంటాడు. మూడు పాత్రలు మూడు విభిన్నంగా సాగుతాయి. దీనికోసం మేకప్ విషయంలో కాస్త ఎక్కువగానే శ్రమపడాల్సి వచ్చింది.
సినిమా కోసం సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నారు?
ఔను. దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం శ్రమించాం. క్వాలిటీ ఎక్కడా మిస్ కాకూడదు కాబట్టి ఈ మాత్రం టైమ్ అవసరమే.
మీరు కావాలనే ఇలాంటి కానె్సప్టులు ఎంచుకుంటారా?
నేను ట్రెండ్ సెట్ చేయాలని అనుకోను. మనం చేసే సినిమా కొత్తగా వుండాలి. ప్రేక్షకులకు కూడా థ్రిల్ అనిపించాలనే ఉద్దేశ్యంతో విభిన్నమైన కథల్నే ఎంచుకుంటాను. అందుకే ‘గజిని’, ‘శివపుత్రుడు’ లాంటి సినిమాలు వచ్చాయి.
మరి తెలుగులో డబ్బింగ్ చెబుతారా?
నాకూ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. దానికోసం తెలుగు నేర్చుకుంటున్నాను. ఇప్పటికే నాకు డబ్బింగ్ చెప్పే శ్రీనివాసమూర్తికి మంచి ఫాలోయింగ్ వుంది. అది మిస్ అవుతుందని భావిస్తున్నాను. ఈ విషయంలో కార్తి మాత్రం త్వరగా నేర్చుకున్నాడు.
విక్రమ్‌తో పనిచేయడం ఎలా వుంది?
విక్రమ్ చాలా పాషన్ వున్న దర్శకుడు. ప్రతి నిత్యం సినిమా గురించే తను ఆలోచిస్తుంటాడు. అతని ఆలోచనా విధానం కొత్తగా వుంటుంది. అలాంటి పాషన్ లేకపోతే ఇలాంటి సినిమాలు రావు. తనతో పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి.
సింగం-3 ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సింగం సినిమాలకు మంచి క్రేజ్ దక్కింది. సౌత్‌లోనే కాకుండా సింగం-2 హిందీలో కూడా హిట్ అవడంతో అందరి దృష్టి సింగం-3పై పడింది.
త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి?
త్రివిక్రమ్‌తో డిస్కషన్ జరుగుతోంది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. తను వేరే సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా తరువాత చూడాలి.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి చర్చల దశలో వున్నాయి. త్వరలోనే అన్నీ కుదిరితే ప్రకటిస్తా.

- శ్రీ