బోల్డ్ సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న సమంత, ఓ వైపు కమర్షియల్ హిట్స్‌తో కూడా హీరోలను ఆకట్టుకుంటోంది. పెళ్ళయ్యాక తన కెరీర్‌కు మరింత ఊపు వచ్చిందని ఆమే చెప్పడం విశేషం. ఎంతోమంది హీరోలు సరైన హిట్స్ లేక కథలకోసం వెతుకుతుంటే, సమంతకు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలు ఎదురవుతున్నాయి. దాంతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. గతంలో కన్నా ఉత్సాహం ఆమెలో రెట్టింపు అయిందని చెబుతున్నారు. సమంత హవా కేవలం టాలీవుడ్ వరకే పరిమితం కాలేదు. విశాల్ అభిమన్యు, సూపర్‌డీలక్స్ చిత్రాలతో అక్కడ కూడా హిట్ కొడుతోంది. ముఖ్యంగా సూపర్‌డీలక్స్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది. అలాంటి బోల్డ్ క్యారెక్టర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని మెప్పించిందని సినిమా సమీక్షకులు ఆకాశానికెత్తేశారు. కొత్తదనం వున్న పాత్రలో ఏదైనా సరే వదలను అని ప్రకటించే ఈ భామ ప్రస్తుతం అలాంటి కథలకోసమే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానంటోంది. ఓకె.. హ్యాపీ!