పవన్ కళ్యాణ్ కథే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో విజయ్ సేతుపతిగా ఈనెల 15న విడుదలకానున్న చిత్రానికి సంబంధించిన కథను పవన్‌కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అది ఆయనతో తీయడం వీలుకాక, అంతే ఫాలోయింగ్ వున్న విజయ్ సేతుపతితో రూపొందించాను అని తెలిపారు దర్శకుడు విజయ్‌చందర్. విజయ్‌సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ ప్రొడక్షన్స్, హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి శ్రీనివాస్ అందిస్తున్న చిత్రం ‘విజయ్ సేతుపతి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సముద్ర ట్రైలర్‌ను విడుదలచేయగా, కంచెర్ల శ్రీకాంత్ చౌదరి, ప్రకాష్‌రెడ్డి, చక్రవర్తి, వెంకటరాజు దంపతులు సినిమాలోని పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ- పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథతో తమిళంలో సంగ తమిళన్ చిత్రాన్ని రూపొందించామని, ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అన్న పేరుతో అందిస్తున్నామని తెలిపారు. రెండు భాషల్లో ఈనెల 15న విడుదల చేస్తున్నామని, తెలుగు నేటివిటీకి సరిపోయే కథ కథనాలతో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని అందించామని ఆయన అన్నారు. నిర్మాత ఓ ఫాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని, పాటలన్నీ ప్రేక్షకులకు క్యాచ్‌బుల్‌గా వుంటాయని ఆయన అన్నారు. దర్శకుడు తీసిన ప్రతీ సీన్ తనకు నచ్చిందని అందుకే తెలుగులో అందిస్తున్నామని, ఓ రకంగా స్ట్రెయిట్ తెలుగు చిత్రంగా వుంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని నిర్మాత రావూరి వి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో మల్లూరి వెంకట్, నాగేశ్ నారదాశి తదితరులు పాల్గొని చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్, మెర్విన్ అందించగా, కెమెరాను ఆర్.వేల్‌రాజ్ అందించారు.