ఎల్సా సితార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై మరో కొత్త తార పరిచయం అవుతోంది. ఆమే సితార. ఎవరనుకుంటున్నారు, మహేష్‌బాబు తనయ. ఏడేళ్ల వయసులోనే ఆమె ఇప్పుడు డిస్నీ ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న ఫ్రాజెన్ 2 చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌లో యువరాణి ఎల్సాకు డబ్బింగ్ చెబుతోంది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో డబ్బింగ్ చెప్పిన సితార గురించి తల్లి నమ్రతా మాట్లాడుతూ- చిన్నప్పటినుండి ఫ్రాజెన్‌లో ఎల్సా పాత్రను చూస్తూ సితార పెరిగింది. ఆ చిత్రమంటే సితారకు చాలా ఇష్టం. అలాంటిది ఎల్సాకు ఆమె గొంతు కావాలనగానే మేము అడ్డు చెప్పలేకపోయాము. ప్రతి అమ్మాయి తనను తాను చూసుకునే పాత్ర ఇది. అయితే సితార కూడా అందుకు మినహాయింపు కాదు. ఓ మంచి అవకాశాన్ని అందించిన డిస్నీ బృందానికి ధన్యవాదాలని ఆమె తెలిపారు. ఫ్రాజెన్ 2లో ఎల్సా ప్రయాణం ఎలా వుంటుంది, ఆ పాత్ర తీరుతెన్నులు ఈ చిత్రంలో కొత్తగా వుంటాయని డిస్నీ ఇండియా ప్రతినిధి దుగ్గల్ అన్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 22న విడుదల కానుంది.