కడప రెడ్లు వస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంగోపాల్‌వర్మ ఏ చిత్రం తీసినా అదొక సంచలనం. ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఆయన తాజాగా టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పప్పులాంటి అబ్బాయి పాటకు విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా, పప్పులాంటి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, రౌడీయిజం, రాజకీయ నేపథ్యాల్లో సాగే కథనంతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని వారు తెలిపారు. మొత్తం 7 పాటలు చిత్రంలో హైలెట్‌గా వుంటాయని, ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో అనేక సెటైర్లు ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చుతాయని వారు తెలిపారు.