ఇప్పుడే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ తాజాగా రాజకీయాలను పక్కనబెట్టి పింక్ రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారన్నది నిజమే. కానీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కూడా ఓకె.. మేం చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పోరాటాల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ బిజీగా వున్నారని, త్వరలో పంచాయితీ ఎన్నికలు దగ్గరవుతుండడంతో రాజకీయ వ్యూహాల్లోనే తలమునకలుగా ఉన్నారని చెబుతున్నారు. అందువల్లనే పవన్‌తో రూపొందించే తాజా చిత్రం ఇప్పుడప్పుడే సెట్స్‌పైకి వెళ్లదని తెలుస్తోంది. అయితే పవన్‌కళ్యాణ్ మాత్రం మంచి కథలు సిద్ధం చేయండి, ఎప్పుడు వీలైతే అప్పుడు షూటింగ్ మొదలుపెడదాం అంటూ అభయం అయితే ఇచ్చారట. దాదాపు వచ్చే జనవరి దాకా ఎటువంటి ప్రకటన పవన్ సినిమాలకు సంబంధించి అధికారికంగా వచ్చే అవకాశమే లేదని టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం.