ప్రేమమ్‌కు నాగ్ వాయిస్‌ఓవర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌‘ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నాగచైతన్య, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మరింత హైప్ తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి నాగార్జున వాయిస్ వోవర్ ఇప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఇతర హీరోల చిత్రాల్లో వాయిస్ వోవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి తనయుడు కోసం నాగార్జున రంగంలోకి దిగాడు. నాగార్జున ఈ ప్రేమకథకు వాయిస్‌వోవర్ ఇస్తే ప్రేక్షకులకు అది కొత్త అనుభూతిగా మిగులుతుందని, దాంతోపాటు సినిమాకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుందని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే నాగార్జున డబ్బింగ్ చెబుతాడట.