వెన్నెల అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నలలో నిలబడిన పాలరాతి బొమ్మలా ఎప్పటికప్పుడు తళుకులు మెరిపిస్తోంది తమన్నా. పాలమీగడలాంటి అందంతో యువకుల హృదయాలను రెచ్చగొట్టేలా రోజురోజుకీ తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది ఈ మిల్కీ భామ. ఇప్పటికి పరిశ్రమకు వచ్చి పదేళ్ళు దాటినా వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‌గా సినిమాలను చేస్తోంది. తాజాగా సైరా చిత్రంలో ప్రశంసలు అందుకున్న ఈ భామ, ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధపడుతుండడంతో మంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. తెలుగులో యంగ్ హీరోలతోపాటుగా అగ్ర కథానాయకులతో జత కట్టి హిట్లు కొడుతోంది. ఇంత బిజీగావున్నా ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొని, అవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కామెంట్లు, లైకులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. వయసు పెరిగినా తనలో ఏ మాత్రం మెరుపు తగ్గలేదని చెప్పడానికే ఈ ఫొటో షూట్ చేసిందా అన్నట్లుగా వున్నాయి ఆ ఫొటోలు. ప్రస్తుతం ఆమె నటించిన యాక్షన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. విశాల్‌తో చేసిన ఈ సినిమా ఆమె కెరీర్‌కు ప్లస్‌కానుంది.