కొత్త ట్విస్ట్.. భలే టేస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో అంటే కేవలం హీరోయిజమ్ చూపించడానికి మాత్రమే పరిమితం. కథలో పాత్రలన్నీ అతడి చుట్టూ తిరిగి ఆ హీరోయిజానికి బూస్టప్ ఇస్తాయి. కానీ హీరో మాత్రం మిగతా పాత్రలకు అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనబడదు ప్రతి స్క్రిప్ట్‌లో. ఎక్కడో తల్లీ, చెల్లి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈమధ్య వచ్చే చిత్రాలలో బావా బావమరుదులు, మరదళ్ల పాత్రలకు కూడా ప్రాధాన్యత వుంటుంది. ఇదంతా కెమెరాకు ముందు జరిగే తతంతం. కెమెరా వెనుక మాత్రం హీరోయిజం అంటే అలా వుండదు. హీరో ప్రతి స్క్రిప్ట్‌లో వేలుపెట్టేస్తున్నాడు, కాలు పెట్టేస్తున్నాడు అన్న మాటలు అపుడపుతూ ఇండస్ట్రీలో వింటూనే వుంటాం. అలా కాలూ, వేళ్ళూ పెట్టేసి స్క్రిప్ట్‌నంతా తనకనుగుణంగా మార్చుకుని సినిమా విడుదలయ్యాక అది చీదేస్తే, నిర్మాతకు సారీ కూడా చెప్పలేని హీరోయిజమ్ అది. అయితే ఇపుడు తాజా ట్విస్ట్ ఏంటంటే, ఇపుడు హీరోలు మరో అడుగు ముందుకు వేసి తమ తలరాతలు తాము రాసుకుంటూ నిర్మాతల భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు. అదెలా అంటే, తాను నటించే సినిమాను తన సొంత బ్యానర్‌లోనే రూపొందించాలి. అది కూడా భాగస్థులుగా కలిసి. ఇద్దరూ కలిసి వాళ్ల పెట్టుబడులు కథకు అనుగుణంగా పెట్టాలి. ఆ తరువాత సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. సినిమా విడుదల కూడా అంతా హీరో చెప్పుచేతల్లోనే నడుస్తుంది. తన సొంత బ్యానర్‌తోపాటుగా ప్రచారం చేసి పెట్టుబడుల్లో కూడా ఎంతో కొంత భాగస్వామ్యంతో కలిసి చేయడంవల్ల ఆయా హీరోకు తనకు నచ్చిన విధంగా చిత్రాన్ని రూపొందించుకునే అవకాశం పూర్తిగా వుంటుంది. అదే వేరే నిర్మాతతో సినిమా మాత్రమే ఒప్పుకుంటే, అతని టేస్ట్‌కు తగిన విధంగా నటించాలి. అలా నటిస్తే ఒక్కొక్కసారి పరాజయం పాలవుతున్నాయి. దీంతో అప్పటివరకు కట్టుకున్న ఇమేజ్ మేడ ఒక్కసారిగా కూలిపోతుందని హీరోల భావనగా ఇపుడు మారుతోంది. తనకు నచ్చినవిధంగా కథను, కథనాన్ని రూపొందించుకోవాలి అంటే, తన భాగస్వామ్యం ఎంతో కొంత ఉండాలని హీరో భావిస్తున్నాడు. అందుకే సినిమా తీయడానికి వచ్చిన నిర్మాత బ్యానర్‌తోపాటుగా తన స్వంత బ్యానర్ కూడా సంయుక్తంగా రూపొందించాలని ఓ కొత్త రూల్ పెడుతున్నారిప్పుడు. అయితే ఇలాంటి రూల్స్‌వల్ల ఆయా నిర్మాతలకు ఎంత తలనొప్పులు అనేది వారి వారి స్టామినాను బట్టి ఉంటుంది. చిన్న నిర్మాత పరిస్థితి అయితే ఇక చెప్పక్కర్లేదు. మొత్తం హీరోనే నిర్మాత కనుక ఇక్కడ ఆతని కనుగుణంగానే అన్నీ నడుస్తాయి. అతని కనుసన్నల్లోనే స్క్రిప్ట్, చిత్రీకరణ జరుగుతుంది. చివరికి కామెడీ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు మొత్తం ఏది ఎంత స్కేల్‌లో పెట్టాలో నిర్ణయించేది అతనే అవుతాడు. గతంలో వేళ్ళూ, కాళ్లూ పెట్టి వేళాకోళం చేయించుకున్న ఆయా హీరోలు, ఇపుడు ఏకంగా ఈ కొత్త ట్విస్ట్‌లో భలే టేస్ట్ వుందంటూ ముందుకొస్తున్నారు. ఇలాంటి సినిమాలు మొదట్లో మెరుపులు మెరిపించినా ఆ తరువాత ఆయా హీరోలకు మళ్లీ చుక్కలు చూపిస్తాయని సినీ పండితులు చెబుతున్నారు. గతంలో ఓ హీరో తండ్రి కూడా కుమారుడి కాల్షీట్స్ కోసం వెళితే, తాను ఫలానా జాతీయ పార్టీలో చేరానని, తన పేరుమీద పార్టీ ఫండ్ ఇవ్వాలని, అప్పుడే తన కుమారుడి కాల్షీట్లు లభిస్తాయని చెప్పాడట. దీంతో సినిమా సంగతి దేవుడెరుగు ఇపుడు పార్టీ ఫండ్ ఎక్కడనుంచి తేవాలని ఆయా నిర్మాతలు సినిమాను నిర్మించడమే మానుకున్నారట. అలాగే యువ హీరోల్లో అనేకమంది తమ తండ్రుల ద్వారానో, తల్లుల ద్వారానో కెరీర్‌ను తల్లక్రిందులు చేసుకున్నవారు అనేకమంది వున్నారు. ఇపుడు వాళ్లు పోయి కొత్తగా బ్యానర్ భాగస్వామ్యం అంటూ వచ్చింది. ఇదెంతకాలం తన హవాను కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందేనని సినీప్రియులు అంటున్నారు.