ఆర్‌కె ఫ్రమ్ తెనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో రైటర్ రాజసింహ మాట్లాడుతూ- సినిమా మొదటినుండీ చివరివరకూ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. షడ్రుచుల విందు భోజనంలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారని, మంచి కథ, కథనాలు ఉన్నాయని నటుడు ప్రదీప్ తెలిపారు. నలుగురు నిర్మాతలు ఈ సినిమాకు నాలుగు స్తంభాల్లా నిలిచారని, అలాగే హీరోహీరోయిన్ల అన్ని ఎమోషన్లు సినిమాలో ప్రేక్షకులను నవ్విస్తాయని దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా రెండు గంటలపాటు ప్రేక్షకులను నవ్వించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో భవాని ప్రసాద్, గణేష్, నివాస్ తదితరులు పాల్గొన్నారు.