శభాష్ నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ ‘చీకటిరాజ్యం’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ‘శభాష్‌నాయుడు’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిపి కమల్‌హాసన్ నిర్మిస్తున్నాడు. టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.
‘దశావతారం’ చిత్రంలో కమల్‌హాసన్ పోషించిన పది పాత్రల్లోని ఓ పాత్రైన పోలీస్ అధికారి నాయుడు పాత్రలో కమల్‌హాసన్ కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కూడా నటిస్తోంది. రమ్యకృష్ణ హీరోయిన్‌గా కనిపించే ఈ చిత్రంలో శృతిహాసన్ కమల్ కూతురిగానే కనిపిస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.