కల్యాణ్‌దేవ్‌తో రచిత రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా దర్శకుడు పులి వాసు తెరకెక్కించనున్న చిత్రం -సూపర్ మచ్చి. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కల్యాణ్‌దేవ్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రచితారామ్ ఎంపికైంది. సినిమా కొత్త షెడ్యూల్‌ను 20నుంచి ప్రారంభిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై కొన్ని ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సీనే్ల సినిమాకు హైలెట్ అవుతాయన్న టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం మొదటి చిత్రం విజేతతో చేసిన కళ్యాణ్‌దేవ్, రెండో చిత్రంతో మరో మెట్టేక్కేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాడట.