అదో వెరైటీ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈషారెబ్బా, సత్యదేవ్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు శ్రీనివాస రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -రాగల 24 గంటల్లో. నవంబర్ 22న సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి మీడియాతో ముచ్చటించాడు.
కామెడీ జోనర్‌లో ఎక్కువ సినిమాలు చేసిన మాట వాస్తవమే. అయితే, నా గత చిత్రాలకు భిన్నంగా రాగల 24 గంటల్లో చిత్రం ఉంటుంది. ఆరంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించి -చివరివరకూ సినిమాను ఉత్కంఠభరితంగా చూసేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. మర్డర్ మిస్టరీతో సాగే థ్రిల్లర్ స్క్రిప్ట్ నచ్చడంవల్లే ఈ సినిమా చేశా. దీనికితోడు ప్రస్తుతం టాలీవుడ్‌లో థ్రిల్లర్స్ జోనర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
నటుడు కృష్ణ్భగవాన్ మంచి రైటర్ కూడా. శ్రీనివాస్ వర్మ రాసిన కథను కృష్ణ్భగవన్ పరిశీలించి నాకు చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.
రాగల 24 గంటల్లో అన్నది నిజానికి రేడియోల్లో వచ్చే అనౌన్స్‌మెంట్. కానీ, స్క్రిప్ట్‌కు ఇదే టైటిల్ యాప్ట్ అనిపించి పెట్టాం. పైగా సినిమా ఓపెనింగే భయంకరమైన వర్షంతో మొదలవుతుంది. అది టీవీల్లో చూపిస్తుంటే, అదే సమయంలో ఓ హత్య జరుగుతుంది. హంతకుడు తప్పించుకున్నాడన్న న్యూస్ వస్తుంది. రాగల 24 గంటల్లో ఈ మిస్టరీ ఎలా ముగుస్తుందన్నదే సినిమా కథనం. వాతావరణంతో ప్రారంభమైన ఈ చిత్రానికి ఈ టైటిలే కరెక్ట్‌గా ఉంటుందని అలా పెట్టాం.
ఈ సినిమాకు కథే హీరో. ఏడెనిమిది పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాత్రలకు తగిన మంచి నటీనటులు కూడా దొరికారు. ఈషా రెబ్బా ఈ చిత్రంలో నయనతారను మరిపించేలా కనిపించటమే కాదు, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా. సత్యదేవ్‌కు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.
ఇదొక సీరియస్ థ్రిల్లర్. అందుకే -ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కామెడీ చొప్పించే ప్రయత్నం చేయలేదు. రెండు గంటలపాటు గ్రిప్పింగ్‌గా సినిమా నడుస్తుంది.
నా సినిమాల గ్యాప్‌కి కారణం -్ఢమరుకం చిత్రం తరువాత చైతూతో ‘హలోబ్రదర్’ సీక్వెల్ చేద్దామనుకున్నాం. అది పట్టాలెక్కలేదు. చైతూతోనే చేయాల్సిన దుర్గా చిత్రం సైతం ఆగిపోయింది. అలా రెండేళ్లపాటు స్ట్రక్ అయిపోవడంతో నా సినిమాలకు గ్యాప్ వచ్చింది.