జెరూసలెంలో తొలికిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను సహజసిద్ధంగా తెరకెక్కించేందుకు జెరూసలం, ఈజిప్ట్ దేశాలకు వెళ్లనున్నామని.
ఇప్పటివరకు వచ్చిన జీసస్ చిత్రాల్లో ఎవరూ టచ్ చేయని కోణాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నామని, క్రైస్తవ సమాజం నుంచే కాక ఇతర వర్గాల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఆర్.పి.పట్నాయక్ మంచి సంగీతం అందించాడు. జూన్ చివరలో లేక జూలై మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ, సినిమా బాగా వచ్చిందని, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ఫారెన్ వెళ్తున్నామని అన్నారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, కళలకు మతం లేదని, సినిమాకూ అంతేనని, ఇదొక మనిషి సినిమా అని, జీసస్ జీవితంలో జరిగిన 40 రోజుల అద్భుత ఘట్టాల్ని ఈ సినిమాలో చూపించబోతురని, చరిత్రలో నిలిచిపోయే విధంగా పాటలు అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి మ్యూజిక్ చేశానని అన్నారు. ఈ చిత్రానికి పాటలు: రెవరెండ్ టి.ఎ.ప్రభుకిరణ్, రచన, సహకారం: ఎం.ఎం.ప్రవీణ్, సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కెమెరా: మురళీకృష్ణ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: సుధాకర్, దర్శకత్వం: జాన్ బాబు.