రీమేక్ కాదట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకేశ్ కనగరాజ్. తమిళంలో ఈ దర్శకుడి పేరు మార్మోగుతోంది. కేవలం షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవంతో తొలిసారి బిగ్‌స్క్రీన్‌కు వచ్చిన లోకేశ్, తొలి చిత్రంతోనే సత్తా చాటాడు. పెద్ద దర్శకులకు సైతం చెమటలు పట్టించే క్రైమ్ థ్రిల్లర్ పాయింట్ చుట్టూ కథల్లుకుని -కార్తితో ఖైదీ చేసి హిట్టందుకున్నాడు. ఖైదీ చేస్తుండగానే లోకశ్ పనితనాన్ని గుర్తించిన స్టార్ హీరో విజయ్ -అతనికి అవకాశం ఇచ్చేశాడు. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ -కొత్త దర్శకుడికి ప్రాజెక్టు ఇవ్వడం సెనే్సషనే అయ్యింది. తాజాగా ‘విజిల్’ ప్రాజెక్టుతో మరో హిట్టందుకున్న విజయ్ -ఇప్పుడు కొత్త ప్రాజెక్టుపై లోకేశ్ కనగరాజ్‌తో సెట్స్‌పైకి వెళ్లాడు. దీంతో విజయ్ -లోకేశ్ కాంబోలో ఓ రీమేక్ తెరకెక్కుతోందంటూ కథనాలు వచ్చాయి. దాంతో ఏ సినిమాకు రీమేక్ అన్న విషయాన్ని తెలుసుకోడానికి విజయ్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తి చూపించటం మొదలెట్టారు. తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ -సవాలక్ష డౌట్స్‌కి క్లారిటీ ఇచ్చేశాడు. ‘విజయ్‌తో చేస్తున్న సినిమా దేనికీ రీమేక్ కాదు. నేను తయారు చేసుకున్న ఒరిజినల్ స్టోరీ’ అంటూ ఫుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు జోనరేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలైంది.