స్క్రీన్ రొమాన్స్‌కు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటి బిగ్‌బాస్ హౌస్‌లో హాట్ టాపిక్ -రాహుల్, పునర్నవి లవ్ అఫైర్. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ అనేక కథనాలు రావడంతో -అలాంటిదేమీ లేదు.. స్నేహం మాత్రమేనంటూ ఇద్దరూ అనేకసార్లు చెప్పుకొచ్చారు. అయినా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్ సెషన్ ముగిసిన తరువాతా ఇదే టాపిక్‌పై పెద్ద చర్చే నడిచింది. అయితే, చర్చలోని సారాన్ని ఆన్ స్క్రీన్‌పై నిజం చేయడానికి ఇద్దరూ సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రాహుల్, పునర్నవి జంటగా ఓ ప్రేమకథతో ఆన్‌స్క్రీన్‌కు వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే -పునర్నవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్తుస్థితుల్లోనూ వదలుకోనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. హాట్ టాపిక్‌గా మారిన ఇద్దరితో సినిమా చేయడానికి ఓ నిర్మాత ముందుకొచ్చాడని తెలుస్తోంది. ఇద్దరితో అద్భుతమైన లవ్‌స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందన్నది తాజా సమాచారం. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.