ఏడుపు సినిమాలంటే అయిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ తమన్నా తాజాగా ‘ఊపిరి’ సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే పలు క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ‘దర్మదురై’ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు విశాల్ సరసన మరో సినిమా చేయడానికి ఓకే చెప్పింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న అభినేత్రి చిత్రంలో నటిస్తోన్న తమన్నా ‘బాహుబలి-2’లో కూడా నటిస్తోంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అందంతో సినిమాలు చేస్తున్న ఈమెకు ఏడుపుగొట్టు సినిమాలంటే ఇష్టం ఉండదట. సినిమా అంటేనే రెండు గంటల సేపు ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ ఏడుపు తెప్పించే సినిమాలు ఇష్టం ఉండదు అని చెబుతోంది. అలాంటి సినిమాల్లో అవకాశం ఇస్తే ఆమె చేయనని కరాఖండిగా చెబుతోంది.