థ్రిల్లర్ రీమేక్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు హీరో సుమంత్. హిట్టుకోసం ఈసారి రీమేక్‌ను నమ్ముకున్నాడు. సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టు -కపటధారి. టైటిల్‌ని కన్ఫర్మ్ చేస్తూ మోషన్ పోస్టర్లను కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రబృందం. ట్విట్టర్ ద్వారా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నాగ్, యూనిట్‌కు అభినందనలు చెప్పాడు. ఫామ్‌లోకి రావడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్న సుమంత్, ఈసారి క్రైమ్ డ్రామాని సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. కన్నడ హిట్ ‘కలువదారి’ని తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే పొలిటికల్ డ్రామాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. నాజర్, నందిత, పూజాకుమార్, వెనె్నల కిషోర్, జయప్రకాశ్, సంపత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీత దర్శకుడు. కపటధారితోనైనా సుమంత్‌కు గుర్తుంచుకునే హిట్టు పడుతుందేమో చూడాలి.