అట్లీ’కానిమ్ము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా వినిపిస్తోన్న కథనమే -కన్మర్మయ్యే అవకాశాలున్నాయి. ‘జీరో’కి ముందునుంచే కెరీర్ జీరో అయిపోవడంతో -రెండేళ్లుగా షారుఖ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. గత రెండేళ్లలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమా ఒక్కటీ షారుఖ్‌నుంచి రాలేదు. దీంతో షారుఖ్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడంటూ కథనాలు వినిపించటం మొదలయ్యాయి. అదే తమిళ కుర్ర డైరెక్టర్ అట్లీకుమార్‌తో సినిమా చేయనున్నాడన్నది. కొంతకాలంగా ఈ కథనం వినిపిస్తున్నా -అందుకు తగిన అప్‌డేట్స్ అయితే లేవు. కాకపోతే -తాజా సమాచారం ప్రకారం అట్లీతో ప్రాజెక్టు చేయాలనే ఎస్సార్కె ఫిక్సయ్యాడని తెలుస్తోంది. వచ్చే మార్చిలోగా ప్రాజెక్టు ఓ షేప్‌కొచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. ఇది అట్లీ స్టయిల్లోని లోడెడ్ యాక్షన్ మూవీ కానుందట. షారుఖ్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ప్రాజెక్టును ప్రకటించే అవకాశం లేకపోలేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనగానే -ప్రాజెక్టు పట్ల ఆసక్తి పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.