చరణ్ రక్షక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త నిరాశ చెందాడు రామ్‌చరణ్. తన తదుపరి చిత్రంతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా ఆయన నటించే చిత్రానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తమిళంలో సూపర్‌హిట్ సాధించిన ‘తనిఒరువన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇందులో విలన్‌గా అరవింద్‌స్వామి నటిస్తున్నాడట. దీనికోసం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఓకె అయినట్టు తెలిసింది. పోలీసు నేపథ్యంతో రూపొందే ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో వుందట యూనిట్. త్వరలోనే హీరోయిన్‌ను ఫైనల్ చేయనున్నారు. మైండ్ గేమ్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి హిట్ కొడతానన్న గట్టి నమ్మకంతో వున్నాడు చరణ్.