అదరగొట్టే మదగదరాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, అంజలి, వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో మదగజరాజ పేరుతో విడుదల చేస్తున్నారు. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈనెల రెండో వారంలో విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, తెలుగు, తమిళ భాషల్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఈ చిత్రంలో చేసిన ప్రత్యేకమైన ఫైట్స్ ఆకట్టుకుంటాయని, అలాగే అంజలి, వరలక్ష్మిల గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. దాంతోపాటు సదా చేసిన స్పెషల్ సాంగ్ మరో ప్రత్యేక ఆకర్షణదా ఉంటుందని, విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన ఈ పాటలకు విశేషమైన స్పందన లభిస్తోందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చాయని, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. తమ బ్యానర్‌లో వచ్చిన ‘జిల్లా’ చిత్రం కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, సంగీతం: విజయ్ ఆంటోనీ, సహ నిర్మాత: రొక్కం సోమశేఖర్‌రెడ్డి, సమర్పణ: జెమినీ ఫిలిమ్స్ సర్క్యూట్, నిర్మాత: తమటం కుమార్‌రెడ్డి, దర్శకత్వం: సుందర్ సి.