కథను నమ్ముతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్‌కళ్యాణ్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నితిన్‌కు నేనంటే ఎంతిష్టమో ఈరోజే తెలిసిందని, నా సినిమాలు తప్ప నేను వేరే సినిమాల గురించి పట్టించుకోనని. కానీ, ఇష్క్ సినిమా సమయంలో నితిన్‌ని చూసినపుడు నాకు తమ్ముడిలా అనిపించాడని, అందుకే ఆడియో ఫంక్షన్‌కు వెళ్లానని, మిక్కి మ్యూజిక్ వినసొంపుగా వుందని, సమంత, నదియాలకు బెస్ట్ విషెస్. ఈ సినిమాతో నితిన్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. తాను రచయితలను గౌరవిస్తానని, కారణం, ఒక హీరోకు మంచి ఇమేజ్ వచ్చిందంటే దానికి కారణం రచయితేనని,, కథను బలంగా నమ్మే వ్యక్తినని, ఈ సినిమా కథ నాకు ముందే తెలుసునని, తెలుగు పరిశ్రమకు మరో మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నితిన్, త్రివిక్రమ్, సమంత, నిర్మాత రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు.