గ్లామర్ పాత్రలే చేస్తే కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది రాశీఖన్నా. ఆ తరువాత నటించిన సినిమాలతో గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. సాయిధరమ్‌తేజ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రాశి చెప్పిన విశేషాలు..
కామెడీ ట్రై చేశా
ఈ సినిమాలో బెల్లం శ్రీదేవి అనే పోలీస్ ఆఫీసరు పాత్రలో కన్పిస్తాను. కామెడీ టచ్‌తో వున్న పాత్ర ఇది. నా కెరీర్‌లో మొదటిసారిగా ఇలాంటి పాత్రను చేశా. తప్పకుండా ఈ సినిమాతో నాకు కామెడీ యాక్టర్‌గా కూడా పేరొస్తుంది. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత వుంది. దీనికోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కామెడీ చేయడం మామూలు విషయం కాదు. స్క్రీన్‌పై చూసుకున్నాక నేనే సర్‌ప్రైజ్ అయ్యా.
తేజు సూపర్ డాన్సర్
తేజ్‌తో సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. తను మంచి డాన్సరే కాదు మంచి కమిట్‌మెంట్ వున్న వ్యక్తి. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘అందం ఇందోళం’ అనే పాట రీమిక్స్ చేశారు. అందులో చిరంజీవిలా తేజు అదరగొట్టాడు. నేను కూడా అతని స్పీడును అందుకోగలనా అనిపించింది. కానీ ట్రై చేశా.
అందరికీ నచ్చేలా
మంచి కథతో తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా వుంటుంది. ముఖ్యంగా అనీల్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని సినిమా చేశాడు. అలాగే దిల్‌రాజు లాంటి పెద్ద బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను యాక్షన్ సన్నివేశాలు కూడా చేశాను. ఇప్పటికే పాటలు మంచి హిట్ అవ్వడంతో సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.
బరువు తగ్గా
గతంలోకంటే కూడా ఇప్పుడు చాలా బరువు తగ్గా. ఈ సినిమా కోసం అని కాదు ఇకపై చేసే సినిమాలకోసం.
గ్లామర్ ఒక్కటే కాదు
హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకూడదు. నటిగా కూడా నిరూపించుకోవాలి. అన్ని గ్లామర్ పాత్రలే చేస్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి.
కవిత్వం రాస్తున్నా
ఖాళీగా వున్నప్పుడు కవితలు రాస్తుంటాను. దాన్ని ప్రచురించాలనే కోరిక కూడా వుంది.
ఇక్కడే సెటిల్ అయ్యా
ఇటీవలే హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్నా. ఇక్కడే సెటిల్ అవ్వాలని వుంది. తమిళ్‌లో కూడా సినిమాలు చేయాలనుంది. బాలీవుడ్ మాత్రం వెళ్ళే ఆలోచన లేదు.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం గోపీచంద్‌తో ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నాను. అది కాకుండా రవితేజ హీరోగా ఓ సినిమా వుంది. అది వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

-యు