నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘ఏ మాయ చేసావె’ సినిమాతో నెగెటివ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి ‘ఎస్సెమ్మెస్’ చిత్రంతో హీరోగా మారాడు సుధీర్‌బాబు. ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్‌బాబు బావ అయిన సుధీర్ తాజాగా ‘్భగీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సుధీర్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా సుధీర్ తన అనుభవాలను మీడియా పంచుకున్నారు. ఆ విశేషాలు ఆ మాటల్లో...
‘మొదటిసారిగా బాలీవుడ్‌లో విలన్‌గా నటించాను. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కూడా విలన్‌గానే. భాగీ సినిమాలోని పాత్రకు మంచి స్పందన వస్తోంది. చాలామంది అభినందిస్తున్నారు. నేను ‘ఎస్సెమ్మెస్’ సినిమాలో చేసిన కొన్ని స్టంట్స్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. అవి చూసి ‘్భగీ’ సినిమా ఆడిషన్స్‌కు రమ్మని పిలిచారు. ఏదో చిత్ర పాత్ర అనుకున్నా. కానీ కథ వినగానే బాగా నచ్చింది. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘వర్షం’ సినిమా రీమేక్ అది. శక్తికపూర్ సినిమా చూసి గొప్పగా అభినందించాడు. ఈ సినిమా తరువాత నీకు చాలా అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఇలాంటి పాత్రల్లోనే నటించాలనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ జీవిత కథతో తెరకెక్కే తెలుగు, హిందీ చిత్రంలో నటిస్తున్నాను. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. దాంతోపాటు భలే మంచిరోజు సినిమాకు కోడైరెక్టర్‌గా పనిచేసిన శ్రీరాం రెడ్డి ఓ కథ చెప్పాడు. ఆ సినిమా కూడా చేయాలి’ అని అన్నాఠు.