జీఏ2తో.. నిఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌ను వేగంగా నడిపించటంలో విఫలమవుతున్న హీరో నిఖిల్ సిద్దార్ధ్‌కు జీఏ2 బ్యానర్లో సినిమా పడింది. కుమారి ఎఫ్21తో దర్శకుడిగా బెంచ్ మార్క్ వేసుకున్న ప్రతాప్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై సుకుమార్, బన్నీ వాసులు సినిమా నిర్మించనున్నారు. 100% లవ్, భలేభలే మగాడివోయ్, గీత గోవిందం వంటి హిట్ చిత్రాలు తెరకెక్కిన జిఏ2 బ్యానర్లో నిఖిల్ చేయనున్న ప్రాజెక్టు -హీరోగా అతని కెరీర్‌కు కొత్త టర్న్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. సక్సెస్‌ఫుల్ టీం ఓకే చేసిన కథకు నిఖిల్ సైతం కనెక్టవ్వడంతో -త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం చెబుతోంది.