థ్రిల్లర్ రెజీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి హీరోయిన్ మెటీరియల్ అన్న ఇమేజైతే వచ్చిందిగానీ, కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే క్రేజీ ప్రాజెక్టు ఇప్పటికీ ఒక్కటీ పడలేదు రెజీనా కాంసాండ్రకు. వస్తున్న అవకాశాల్లో తనను తను ప్రూవ్ చేసుకుంటున్నా -చేస్తున్న ప్రాజెక్టులకు హిట్టుటాక్ లేక స్టార్ స్టేటస్ అందుకోలేకపోతోంది. ఆమధ్య ‘ఎవరు?’ అంటూ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేసిన ఈషా -వైవిధ్యమైన విలన్ పాత్రతో మెప్పించటం తెలిసిందే. తాజాగా తమిళంలో మరో థ్రిల్లర్‌కు రెజీనా సైన్ చేసిందన్న టాక్ వస్తోంది. నిజానికి నయనతార చేయాల్సిన పాత్ర.. అటు ఇటు తిరిగి రెజీనాకు అందడంతో -కెరీర్‌లో కొత్త మలుపు రావొచ్చన్న ఆశతోవుంది రెజీనా. భారీ బడ్జెట్ సినిమా సాహోలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అరుణ్ విజయ్‌కి -ఆ సినిమా హిట్టుతో సంబంధం లేకుండా మంచి చాన్స్‌లు వస్తుండటం తెలిసిందే. తన మార్క్ చిత్రాల్లో హీరో పాత్రలు చేస్తూనే, పెద్ద ప్రాజెక్టుల్లో క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోన్న అరుణ్ విజయ్ -ఈ ఏడాది ఆరంభంలో తడమ్ థ్రిల్లర్‌తో సెనే్సషన్ హిట్టందుకున్నాడు. తాజాగా తమిళ దర్శకుడు అరివజగన్‌తో కొత్త ప్రాజెక్టుకు టైఅప్ అయ్యాడట. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో కుట్రమ్ 23 రావడం తెలిసిందే. అరుణ్ విజయ్ -నయన్ జోడీగా కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించటంలో జరిగిన ఆలస్యం కారణంగా నయన్ ప్రాజెక్టుకు దూరమైందన్న టాక్ వస్తోంది. తాజాగా ఆ పాత్ర కోసం రెజీనా కాసాండ్ర సైన్ చేసిందన్నది ఇండస్ట్రీ టాక్. అరుణ్ విజయ్ -రెజీనా జోడీ స్క్రీన్‌కు తొలిసారే అయినా.. ఇద్దరి కెమిస్ట్రీపై ఆసక్తి లేకపోలేదు. ఇంతకుముందొచ్చిన కుట్రమ్ 23 మాదిరిగానే -సరైన థ్రిల్లర్ కంటెంట్‌తోనే సినిమా ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. త్వరలోనే ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.