ఒట్టు.. ఒక్క హిట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో గోపీచంద్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వరుసపెట్టి బోల్తా కొడుతుండటంతో -కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. ఒక్క హిట్టు కోసం హీరో చేస్తోన్న ప్రయత్నాలేవీ కలిసిరావడం లేదు. ఎన్నో ఆశలతో చేసిన చాణక్య సైతం నిరాశపర్చటంతో -కన్ఫ్యూజన్‌లో పడ్డాడు గోపీచంద్. ఆరంభంలో హిట్లిచ్చి కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టిన తేజను -క్రైసిస్ నుంచి నిలబెట్టే బాధ్యత అప్పగించనున్నాడట. తేజతో చేసిన జయం, నిజం చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న చిన్నా -ఈసారి హీరోగా బ్రేక్ కోసం తేజతో సినిమా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. తేజ సైతం గోపీచంద్ పట్ల ఆసక్తి చూపించటంతో -ఇద్దరి మధ్య ఒక విడత చర్చలు జరిగాయని తెలుస్తోంది. పనిలో పనిగా గోపీచంద్‌కు తేజ చెప్పిన లైన్ నచ్చటంతో -క్యారెక్టర్ స్టామినాతో నడిచే కంటెంట్‌ను తేజ సిద్ధం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తోన్న సినిమాలో గోపీచంద్‌తో తమన్నా రొమాన్స్ చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి తేజ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే -వచ్చే ఏడాది గోపీచంద్-తేజ కాంబినేషన్‌లో ప్రాజెక్టు మొదలయ్యే అవకాశముంది.