తెలుగుపై ఫోకస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగమ్మాయి తమిళంలో ప్రూవ్ చేసుకుని -ఇప్పుడు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమెవరో కాదు -ఐశ్వర్య రాజేష్. తమిళ ‘కణ’కు తెలుగు రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్‌లో తళుక్కుమన్న ఐశర్య రాజేష్ -ఇప్పుడు తెలుగు చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. కౌసల్య పాత్రతో మెప్పించిన ఐశ్వర్య -తరువాత ‘మిస్ మ్యాచ్’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించడానికి సిద్ధమైంది. ఉదయ్ శంకర్ -ఐశ్వర్య జోడీగా డిసెంబర్ 6న థియేటర్లకు వస్తోన్న చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కనుక ఆడియన్స్‌ని మెప్పిస్తే ఐశ్వర్యకు మరిన్ని చాన్స్‌లు రావడం ఖాయం. ఇప్పటికే ఆమె విజయ్ దేవరకొండ -వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో చేస్తోంది. తాజాగా నాని -శివనిర్వాణ కాంబోలో రానున్న ‘టక్ జగదీష్’లోనూ చాన్స్ అందుకుంది. సో, తెలుగు దర్శక, నిర్మాతల ఆదరణ -ఐశ్వర్య రాజేష్‌కు అందినట్టే.