జీవితం వెనక్కెళ్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రాస్ టైమ్ కనెక్షన్ కానె్సప్ట్‌తో దర్శకుడు హరిప్రసాద్ జక్కా తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ -ప్లేబ్యాక్. కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మించిన చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు సుకుమార్ లాంచ్ చేశారు. కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ -చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. కమ్రాన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైంలో బాగా చేశాడు. నేను చెయ్యాలనుకున్న కథ ఈ ప్లే బ్యాక్. డిఫరెంట్ కానె్సప్ట్. హిట్టయ్యే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. దర్శకుడు హరిప్రసాద్ సహా టీం అందరికీ మంచి పేరు తెస్తున్నానని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ -హీరో దినేష్ తేజ్ కష్టపడ్డాడు. డిఫరెంట్ వేరియేషన్స్ వున్న కథ విన్న వెంటనే అనన్య ఒప్పుకుంది. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశానంటే కారణం -నా టెక్నికల్ టీం. మీడియా సపోర్ట్‌తో సినిమా మరింత ప్రేక్షకులకు చేరువవుతుందని ఆశిస్తున్నా అన్నారు. డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ -మీడియా కారణంగానే చిన్న సినిమాలకు ఆదరణ దక్కుతోంది. టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా అంతకంటే బావుంటుందని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరోయిన్ అనన్య మాట్లాడుతూ -ప్లే బ్యాక్ కథ బాగా నచ్చింది. మల్లేశం తరువాత ఓ మంచి సినిమా చేసే అవకాశం దక్కింది. సినిమాకు ప్రని చేసిన టీం మొత్తానికి బెస్ట్ విషెస్ అన్నారు. హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ -నా కెరీర్‌కు ఓ మైల్‌స్టోన్ లాంటి సినిమా ఇది. చిన్న సినిమాను ఆడియన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో అర్జున్ కల్యాణ్ మాట్లాడుతూ -కొత్త కనె్సప్ట్‌తో వస్తున్న చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నాం. కార్యక్రమంలో ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ డీజే రాజు తదితరులు మాట్లాడారు.