అదే.. నా ఐడెంటిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆటగదరా శివ’లాంటి డీసెంట్ సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించిన ఉదయ్ శంకర్ తాజా సినిమా -మిస్ మ్యాచ్. ఐశ్వర్యరాజేష్ హీరోయిన్. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై దర్శకుడు ఎన్‌వి నిర్మల్‌కుమార్ తెరకెక్కించాడు. జి శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్ రూపొందించిన సినిమా డిసెంబర్ 6న థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో ఉదయ్ శంకర్ మీడియాతో మాట్లాడాడు.
*
హైస్కూల్ టైంలోనే ‘చిరుజల్లు’లో నటించా. దాసరి తీసిన ‘యంగ్ ఇండియా‘లోనూ చిన్న పాత్ర చేశా. అలాగే ‘లింగ’, ‘పవర్’ సినిమాల్లో చిన్న సీన్లు చేశాను. అలా నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌తో సాగిన ఐదేళ్ల ప్రయాణం -నా కెరీర్‌కు పునాది వేసింది.
కన్నడ హిట్ ‘రామా రామా రే’ తెలుగు రీమేక్‌లో హీరో పాత్ర దక్కింది. దానికోసం ఏడాదిపాటు జుట్టు పెంచా. ఆ సినిమాయే ‘ఆటగదరా శివా’. హీరోగా తొలి సినిమాలో వైవిధ్యమైన పాత్ర చేయడమే -ఇండస్ట్రీలో ఐడెంటిటీ దొరికింది. ఈమధ్యే దర్శకుడు త్రివిక్రమ్ అప్రీసియేషన్ సైతం దక్కింది.
కంటెంట్ ప్రధానంగా ఉండే లవ్ స్టోరీ చేసే ఆలోచనతో ఉన్నపుడు -భూపతిరాజా చెప్పిన మిస్‌మ్యాచ్ లైన్ నచ్చింది. ఫ్యామిలీ, యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా కథను డెవలప్ చేశారు. ఐటీ ఉద్యోగి సిద్దు పాత్ర నాది. కనక మహాలక్ష్మీ అలియాస్ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య కనిపిస్తుంది.
భూపతిరాజా సజెషన్ మేరకు దర్శకుడు నిర్మల్‌కుమార్‌కు కథ వినిపించినపుడు నచ్చి చేస్తానన్నారు. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు ఆయనకు బాగా నచ్చాయి. ఇద్దరి సమ ప్రాధాన్యమున్న కథ ఇది.
నిజానికి నాకిది రెండో సినిమా. ఇప్పటికే ఐశ్వర్య నేషనల్ అవార్డు విన్నర్. తమిళంలో పెర్ఫార్మ్‌డ్ స్టార్. నటన విషయంలో ఆమెతో మిస్ మ్యాచ్ కాకూడదని కాస్త ఎక్కువ కసరత్తే చేశా. నాలోని నెర్వస్‌నెస్‌ని పొగొట్టడానికి ఆమె చాలా కోపరేట్ చేశారు. ఈ పాత్ర నేను బాగా చేయగలగడానికి కారణం ఇద్దరే. ఫస్ట్ దర్శకుడు. సెకెండ్ ఐశ్వర్య.
నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని. భవిష్యత్‌లో హీరోగా లవ్‌స్టోరీ చేస్తే ‘తొలిప్రేమ’లోని ఫేవరేట్ సాంగ్ ‘ఈ మనసే’ రీమిక్స్ చేయాలనుకునేవాడిని. దీనిమీద అనేక కోణాల్లో చర్చించుకున్న తరువాత -హైదరాబాద్‌లోనే షూట్ చేశాం. సాంగ్‌ను విడుదల చేసిన పవన్ కల్యాణ్ బాగా ఎంజాయ్ చేశారు. సింగిల్ టేక్ సాంగ్‌లో నీ కష్టం కనపడుతుంది అంటూ ప్రశంసించారు కూడా. ఆయనకు నచ్చింది కనుక, ఫ్యాన్స్‌కూ నచ్చుతుందనే అనుకుంటున్నా.
తరువాతి ప్రాజెక్టులపైకి నా ఫోకస్ ఇంకా పోలేదు. ప్రస్తుతం ఈ సినిమాపైనే ఉంది. రెండు మూడు కథలు ఫైనలై ఉన్నాయి. వాటిగురించి ఆలోచిస్తా.