1న లచ్చిందేవి వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయూఖ క్రియేషన్స్ పతాకంపై నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ, లక్ష్మీదేవి కూడా ఎవరి దగ్గరికి రావాలో, ఎవరి దగ్గరికి రాకూడో ఓ లెక్క ప్రకారమే చేస్తుందని, అటువంటి ఓ కథనాన్ని తీసుకుని పూర్తి హాస్యభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగానే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని, లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర యాక్షన్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, నర్రా శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, పాటలు:శివశక్తిదత్తా, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ఈశ్వర్, నిర్మాత:సాయిప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం:జగదీశ్ తలశిల.