ప్లాస్టిక్‌పై లఘు చిత్ర పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం, ధూమపానం సేవించేవారికే హాని చేస్తాయి. ప్లాస్టిక్ మాత్రం మానవాళికే పెనుశాపమవుతుంది. ఆ మహమ్మారిని నిరోధించేందుకు తెలంగాణ సర్కారు కంకణం కట్టింది. కుంభమేళా తరువాత భారీగా జరిగే మేడారం జాతరను ప్లాస్టిక్హ్రితంగా నిర్వహిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ప్రజావగాహన కలిగించేందుకు లఘు చిత్రాల పోటీని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వీరశంకర్, సభ్యులు, దర్శకులు శివనాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రయివేట్ కంపెనీ సిఇఓ నగేష్ కోడూరు మీడియాతో మాట్లాడారు. 3 నుంచి 5 నిమిషాల నిడివితో ప్లాస్టిక్‌తో ప్రపంచానికి జరుగుతోన్న అనర్థం తెలిసేలా లఘు చిత్రం తెలుగులో ఉండాలని, జనవరి 10 వరకు చిత్రాలు అందించేందుకు గడువు ఉందన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 75, 50, 25వేలు అందిస్తామన్నారు. వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఇన్నోవేటివ్‌యాడ్స్.కో.ఇన్ సంప్రదించాలని కోరారు.