మామ.. వెరీ హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య. స్క్రీన్‌పైనా అలాగే కనిపించనున్న సినిమా -వెంకీమామ. డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్‌డే. అదే రోజు సినిమా విడుదలవుతోంది. ఆ సందర్భంగా మీడియాతో వెంకటేష్ ముచ్చటించాడు.
చిన్నప్పుడు చైతూ బొద్దుగా ఉండేవాడు. ఇంట్లో అంతా వాడిని ఎత్తుకోడానికి, హగ్ చేసుకోడానికి సందడి చేసేవాళ్లం. వాడిప్పుడు పెద్దాడయ్యాడు. ఇద్దరం కలిసి సినిమా చేసేసరికి -ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. మామా అల్లుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈమధ్య సినిమాల్లేవు. అదీ ఈ ప్రాజెక్టుకు ప్లస్.
నటుడిగా -తెలుగు ఆడియన్స్ దగ్గర ఒక్కసారి యాక్సెప్టెన్స్ దొరికితే.. వాడిపై ఎప్పటికీ అభిమానం చూపిస్తుంటారు. కలియుగ పాండవులు చిత్రంలో అదే టెన్షన్‌పడ్డా. బట్, యాక్సెప్టెన్స్ దొరికింది. ఆ తరువాత హిట్, ఫ్లాప్ లెక్కలేసుకోలేదు. ఆడియన్స్ బలం నాకెప్పుడూ ఉంది.
మనమేం చేయగలం? ఏం చేస్తున్నాం? అన్నది స్పష్టంగా తెలుసుకోవడమే కెరీర్ సక్సెస్ అనుకుంటాను. ఎవరినో చూసి ఏదో అనుకరిస్తే బోల్తాపడటం ఖాయం. ఇది నా అనుభవం. నేను పాటించే ఫార్ములా కూడా.
నిజమైన ప్రేమున్నచోట భావోద్వేగంతో కూడిన బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ముందు జాతకాలు, నమ్మకాలు దిగదుడుపే. ఆ కంటెంట్ నేను నమ్ముతా. సినిమా మీరు చూస్తారు.
మా కాంబోలో సినిమా అన్నది కల నిజమైన ఎక్స్‌పీరియన్స్. అలాగని, కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ లేకుండా చేయలేదు. ఏదో చేసేద్దాం అనుకుంటే -మా కాంబోలో సినిమా ఎప్పుడో వచ్చేసేది. మంచి కథ కోసం చూశాం. ఇప్పుడొస్తున్నాం.
నేను -చైతూతో. లేదంటే రానాతో. అదీకాకుంటే ఫ్యామిలీ అంతా కలిసి.. సినిమా చేయాలన్న కల నాన్నది. ఆయనున్నపుడు కథలు కుదరలేదు. ఇప్పటికైనా నాన్న కల నిజమయ్యే సినిమా సిద్ధమైంది. అదే చాలా సంతృప్తినిస్తోంది. సినిమాలో భావోద్వేగాలే కాదు, బిగితగ్గని యాక్షన్ సీక్వెన్స్‌లూ ఉంటాయి. పక్కా కమర్షియల్.
నేనే సైలెంట్ అంటే, నాకంటే పెద్ద సైలెంట్ చైతూ. ఇద్దరి మధ్య బాండ్ ఓపెన్ కావడానికి సెట్స్‌లో కొంత టైంపట్టిన మాట నిజం. చిత్రమేంటంటే -వాడిలో మేనమామ పోలికలు చాలానే ఉన్నాయి.
ఎవరిది ఎక్కువ స్క్రీన్ టైం అన్న లెక్కలు నాకు అస్సలు పట్టవు. చైతూతోనే కాదు, ఎవరితో చేసినా అలాంటి లెక్కలేసుకోను. వేసుకోలేదు కూడా. చేసే పాత్రకు మనపరంగా జరిగిన న్యాయమెంత? ఇదే నా లెక్క. ఎఫ్2 కూడా అలానే చేశా. ముందుతరం హీరోల్లో అదే చూశా. అలాంటిదే పాటిస్తున్నా. సో, వెంకీమామలో స్క్రీన్ షేర్ లెక్కల్లేవ్.
33 ఏళ్ల కెరీర్ దాటేస్తున్నాను. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో సినిమా చేశా. ఇప్పుడు చైతూతో. ఎన్టీఆర్, నాని... ఇలా ఇప్పటి జనరేషన్స్‌తో సినిమాలు చేస్తే.. నేనూ చాలా నేర్చుకోవచ్చు.
శ్రీకాంత్ అడ్డాల ఈసారి సక్సెస్ కోసం ఆవురావురు అంటున్నాడు. బేసిగ్గా హార్డ్‌వర్కర్. మా ఇద్దరికీ మంచి రిలేషన్‌షిప్ వుంది. సీతమ్మవాకిట్లో తరువాత ఓ రెండు స్క్రిప్ట్స్ చెప్పాడు కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకి మళ్లీ సెట్టైంది. త్వరలోనే అసురన్ సెట్స్‌పైకి వెళ్తుంది.

నెంబర్లేంటమ్మా..
వెంకటేష్ -గ్యాప్‌లేకుండా 74వ ప్రాజెక్టుకీ రెడీ అయ్యాడు. అంటే -వచ్చే జనవరి నుంచే అసురన్ రీమేక్ సెట్స్‌పైకి వెళ్తోంది. సో, నెంబరింగ్ దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకున్న వెంకీ 75వ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. కొద్దిరోజుల క్రితం తరుణ్ భాస్కర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వచ్చింది. ప్రాజెక్టు -తరుణ్‌తో ఉండొచ్చన్న టాక్ వచ్చేలోగానే.. ఎఫ్2తో బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చిన అనిల్ రావిపూడి పేరూ వినిపిస్తోంది. మహేష్‌తో అనిల్ చేస్తున్న ప్రాజెక్టు సంక్రాంతికి వస్తోంది. ఈ సినిమా రిజల్ట్‌నుంచి వెంకీ ప్రాజెక్టు ఎవరికి అందుతుందన్న కాలుక్యులేషన్స్ ఉంటాయన్న టాక్ లేకపోలేదు. ఏదేమైనా వెంకీ 75వ ప్రాజెక్టు ఇద్దరి మధ్యే ఉంటుందా? సీన్‌లోకి మరో డైరెక్టర్ వస్తాడా? అన్నది తేలాలి. వెంకీ మాత్రం ఏ నెంబరైతే ఎంటమ్మా.. అనేస్తున్నాడు తాత్వికంగా.

-ప్రవవి