ఆశలన్నీ టక్కర్‌పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యాన్షి కౌశిక్ పేరు వినగానే మజిలీలోని ఆమె సాలిడ్ పెర్ఫార్మెన్స్ గుర్తుకొస్తుంది. కాకపోతే, క్యారెక్టర్ పైనున్న సింపతీతో ఇమేజ్ కాస్తా సమంత అకౌంట్‌లో పడింది. దాంతో దివ్యాన్షికి సరైన అవకాశాలు రాలేదు. చాన్స్‌ల కోసం కొంతకాలం వేచి చూసిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ సినిమాలపై దృష్టి పెట్టిందట. అలా సిద్ధార్ధ్ చేస్తున్న టక్కర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. రాక రాక వచ్చిన అవకాశంపై దివ్యాన్షి చాలా ఆశలే పెట్టుకుందట. తమిళంతోపాటు తెలుగులోనూ సినిమాను విడుదల చేయనున్నారు కనుక -తెలుగు ఆడియన్స్‌ని మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించే అవకాశం దొరికినట్టే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడం హీరో సిద్ధార్థ్‌కే కాదు, దివ్యాన్షికి చాలా అవసరం. అదే జరిగితే -తెలుగు తమిళంలో ఆమెకి ఆఫర్లు పెరిగే అవకాశాలైతే లేకపోలేదు.