1న డిగ్రీ కాలేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణంలాంటి అవార్డు చిత్రాలు నిర్మించిన దర్శకుడు నరసింహ నంది.. తన పంథాకు భిన్నంగా రొమాన్స్ మేళవించి రూపొందించిన చిత్రం -డిగ్రీ కాలేజ్. వరుణ్, దివ్యారావు హీరో హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ -ఈసారి ఆర్ట్ జోనర్‌కాకుండా, ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యథార్థ ప్రేమ సంఘటనల ఆధారంగా సినిమా చేశా. ప్రేమికులిద్దరూ క్లాస్‌రూంలో, బయట ఎలా ప్రవర్తించారన్న అంశాలను సహజత్వానికి దగ్గరగా చూపించాం. కమర్షియల్ అంశాలను పొందుపర్చి చేసిన సినిమా అన్నారు. హీరో వరుణ్ మాట్లాడుతూ -ఇలాంటి సినిమాలు యువతను చెడగొడుతున్నాయన్న అపవాదు ఉంది. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ సినిమా చేయడం జరిగింది. రొమాన్స్‌న సబ్జెక్టులో భాగంగానే పెట్టారు అన్నారు. హీరోయిన్ దివ్యారావు మాట్లాడుతూ -భావోద్వేగ సన్నివేశాలతో సాగే ఈ ప్రేమ కథ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నా అన్నారు. కార్యక్రమంలో రవిరెడ్డి, మదన్, చిత్రబృందం పాల్గొంది.