ఫస్ట్‌లుక్‌లో రోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం -రోరి. బికినీ బేబ్స్‌తో నిర్వహించిన ఈవెంట్‌లో సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత నాగసుశీల విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ -ఇప్పటి వరకూ చేసిన బాణీలు, సినిమాలకు భిన్నమైన మ్యూజిక్ చేయగలిగాను. అందుకు కంటెంట్ కారణం. ఊహించని లిరిక్స్, మ్యూజిక్, లాంగ్వేజ్‌ను ఈ సినిమాలో చూస్తారు. అదో తరహా కంటెంటే ఈ సినిమాకు ప్రాణం అన్నాడు. నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ -ప్రస్తుత సినిమాలకు భిన్నమైన కంటెంట్‌తో చరణ్ నిర్మాత, దర్శకుడిగా వస్తున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆకాంక్షిస్తున్నా. ఈ ప్రాజెక్టులో ఓ మంచి పాత్ర చేస్తున్నా అన్నారు. నిర్మాత నాగసుశీల మాట్లాడుతూ -పోస్టర్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. చరణ్ వాళ్ల మదర్‌తోవున్న పరిచయంతో కార్యక్రమానికి హాజరయ్యాను. చరణ్ రూపొందిస్తున్న చిత్రం మంచి హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. చరణ్ తేజ మాట్లాడుతూ -మెడిసిన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. సొసైటీలో బ్యాడ్ బోయ్స్ తప్ప గుడ్ బోయ్స్ లేరు. నా లైఫ్ కూడా సినిమా కథకు దగ్గరగానే ఉంటుంది. మనం చాలామంది చేతిలో మోసపోతూ ఉంటాం. అదే సినిమా కథ. రియల్ లైఫ్‌లో, రీల్ లైఫ్‌లో నేను బ్యాడ్ బోయ్‌ని. సినిమాలో హీరోయిన్ ఉండదు. నాగసుశీల ఫస్‌లుక్ ఆవిష్కరించటం హ్యాపీగా ఉంది అన్నారు.