భారీ బడ్జెట్‌తో గోపీచంద్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యాచోస్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జోడీగా -శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై కొత్త సినిమా మొదలైంది. దిగంగన సూర్యవంశీ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ‘యు టర్న్’లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న మూడో చిత్రమిది. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించనున్న ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ సమకూరుస్తుంటే, భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ -ప్రాజెక్టుకు సంబంధించి మొదటి షెడ్యూల్ మొదలైంది. అజిజ్ నగర్‌లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. గోపీచంద్ కెరీర్‌లోనే హై బడ్జెట్ ఫిల్మ్ ఇది. ఈ బ్యానర్‌పై మరో ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుంది. గోపీచంద్‌తో తమన్నా, దిగంగన సూర్యవంశీ జోడీకట్టారు. ఈ వేసవికి సినిమాను తెచ్చే ప్రణాళికతో, ఈ షెడ్యూల్ తరువాత గ్యాప్ లేకుండా రాజమండ్రి, ఢిల్లీ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహిస్తాం అన్నారు. చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.