27న ధనుష్ తూటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, మేఘా ఆకాష్ జోడీగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం -ఎనైనోకి పాయుమ్ తోట. తెలుగులో తూటా టైటిల్‌తో డిసెంబర్ 27న థియేటర్లకు వస్తోంది. విజయభేరి బ్యానర్‌పై గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో జి తాతారెడ్డి, జి సత్యనారాయణ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -కాంబినేషన్, పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటం మాకు కలిసొచ్చే విషయం. తమిళంలో ఇప్పటికే సినిమా హిట్టు కొట్టడంతో -తెలుగు వర్షన్‌పైనా నమ్మకంతో ఉన్నాం అన్నారు.