సిసలైన దొంగనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చేసిన సినిమాలతో.. చేయాల్సిన సినిమాలను కంపేర్ చేయను. సినిమా ఒప్పుకునేటప్పుడే -హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్న ఫ్రెష్ థాట్‌తో ఉంటా. చేసే ప్రతి కథా నచ్చాలి. అందుకే -పదమూడేళ్ల కెరీర్‌లో 19వ నెంబర్‌లోనే ఉన్నా.
‘దొంగ’ సినిమా చేయడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్. ‘రంగ్ దే బసంతి’ ఫేమ్ రెన్సిల్ డిసిల్వ కథ చెప్పినపుడు, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ కనుక దర్శకుడిగా జీతూ జోసెఫ్ బావుంటుందని అనుకున్నాం. అలా రెండేళ్ల ప్రణాళికతో వచ్చిన చిత్రం దొంగ -అంటున్నాడు హీరో కార్తి. తమిళంలో కార్తి, జ్యోతిక కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘తంబి’ చిత్రం తెలుగులో దొంగగా డిసెంబర్ 20న థియేటర్లకు వస్తోంది. నిఖిలా విమల్, సత్యరాజ్, రేవతి, షావుకారు జానకి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం కార్తి మీడియాతో మాట్లాడాడు.
* కెరీర్ ఆరంభంలో కొన్ని మిస్టేక్స్ చేశాను. నిజానికి అవే గొప్ప పాఠాలు నేర్పించాయి. ఇప్పుడు -బాగా ఆలోచించి.. కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా. ఈమధ్యే ‘ఖైదీ’గా వచ్చిన నన్ను ఆడియన్స్ ఆదరించారు. నెల తిరక్కుండానే ‘దొంగ’గా వస్తున్నా. ఇదీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నా.
* రెన్సిల్ డిసిల్వ సిద్ధం చేసిన కథ -ప్రాసెస్‌లో చాలామందికి నచ్చింది. అక్క పాత్ర చేస్తున్న వదిన జ్యోతికకూ నచ్చటంతో -ప్రాజెక్టుపై వర్క్ మొదలైంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఓకే అనటంతో మరింత నమ్మకం పెరిగింది.
* ఈ సినిమాకు మంచి టెక్నీషియన్లు వర్క్ చేశారు. ‘దొంగ’కు వాళ్లే ప్రాణం.
* పాత్రధారులంతా స్టాల్‌వాల్ట్స్. జ్యోతిక, సత్యరాజ్, షావుకారు జానకి వీళ్లంతా గ్రేట్ ఆర్టిస్టులు. వాళ్లతో పనిచేయడం నా అదృష్టం.
* నిజానికి ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కామెడీ, స్ట్రాంగ్ ఎమోషన్స్, సస్పెన్స్‌వున్న కథ. దర్శకుడిగా జీతూ జోసెఫ్‌కు ఓ స్పెషాలిటీ ఉంది కనుక -థ్రిల్లింగ్ మూమెంట్స్ మరింత బలమయ్యాయి.
* నాది ‘దొంగ’ పాత్ర. అతనిలో ఎలా పరివర్తన వచ్చింది, అతని జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి సాగిందన్నదే ప్రధాన కథాంశం. ఇంతకుముందు నేను చేసిన ‘నాపేరు శివ’, ‘ఊపిరి’ చిత్రాలను కలిపి చూస్తే కలిగే భావన -ఈ సినిమాతో ఆడియన్స్‌కు అందుతుంది. ఈ పాత్ర నా మనస్తత్వానికి దగ్గరగా ఉందేమో అనిపించింది.
* దర్శకుడు జీతూ జోసెఫ్‌తో వర్క్ చేయడం -ఎక్కువ విషయాలను తక్కువ టైంలో నేర్చుకున్నట్టే ఫీలవుతున్నా. పెద్దపెద్ద స్టార్స్‌తో ఆయన వర్క్ చేసినా -ప్రాజెక్టుకి వచ్చాక ఓ కాలేజ్‌మేట్‌లా, ఓ బెంచ్‌మేట్‌లా మారిపోవడం భలే అనిపించింది. షూట్‌వున్న ప్రతిరోజూ.. ముందు స్క్రిప్ట్‌మీద టీం మొత్తంతో డిస్కషన్ పెట్టేవారు. క్షుణ్ణంగా డిస్కస్ చేసిన తరువాత -షూట్‌ని ఈజీగా ముగించేవారు. ఆ స్టయిల్‌కి బాగా కనెక్టయ్యాను. ఆయనతో కలిసిన పని చేయడం నా కెరీర్‌లో ఓ అద్భుతమైన కొత్త అనుభవం.
* మంచి కథతో మంచి సినిమా చేయడం కష్టం కాదు. కానీ, దాన్ని విడుదల, ఆడియన్స్‌కి దగ్గర చేసే ప్రమోషన్స్ చాలా చాలా ముఖ్యం అని నమ్ముతాను. ఈ విషయంలో మంచి తమిళ, తెలుగు నిర్మాతలు దొరకడం నా అదృష్టం.
* వదినతో కలిసి సినిమా చేసిన ఆనందంలో ఉన్నా. ఇక అన్న సూర్యతో కలిసి చేయాలి. మంచి కథ దొరికితే -ఆ కోరికా నెరవేరుతుందేమో చూడాలి.

-ప్రవవి