విక్రం కుమార్‌తో మహేష్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్‌బాబు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ అందరూ మహేష్ పేరునే జపిస్తున్నారు. మహేష్‌తో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. బ్రహ్మోత్సవం తరువాత మహేష్, మురగదాస్ దర్శకత్వంలో రూపొందే సినిమా జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పటికే త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ లాంటివారు క్యూలో వున్నారు. తాజగా మరో దర్శకుడు చేరిపోయాడు. సూర్యతో 24 లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రేజీ దర్శకుడు విక్రంకుమార్. ఇప్పటికే మహేష్‌తో సినిమా చేయాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. విక్రం టాలెంట్ నచ్చిన మహేష్ కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిగానే వున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే మహేష్‌కు లైన్ కూడా చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం విక్రంకుమార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో వున్నారు. ఈ సినిమా తరువాత మహేష్‌తో సినిమా వుండవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ వుంది.