రామ్‌తో రాశి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగులో రాశీఖన్నా హవా బాగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈమె హైదరాబాద్‌లో సెటిల్ అయింది. ఇటీవలే ‘సుప్రీమ్’ చిత్రంలో నటించిన రాశీఖన్నా, ప్రస్తుతం రవితేజ సరసన ఓ చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యింది. దాంతోపాటు హీరో రామ్ సరసన కూడా మరోసారి నటిస్తోందట. ‘నేను శైలజ’ సినిమాతో హిట్ అందుకున్న రామ్, కొంత గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రంలో రాశీ హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందట. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మిస్తోంది. గతంలో రాశీఖన్నా రామ్‌తో ‘శివం’ చిత్రంలో నటించింది. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా ఈ జోడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాంతో మరోసారి ఈమెనే హీరోయిన్‌గా ఎంచుకున్నారట.