జాలీగా.. బర్త్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలానికిపైగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన గ్లామర్ భాష త్రిష తన పుట్టినరోజు వేడుకను ఆమె సన్నిహితులతో జరుపుకుంది. ‘వర్షం’ సినిమాతో తెలుగులో కమర్షియల్ విజయాన్ని అందుకుని స్టార్ హీరోల సరసన నటించిన త్రిషకు ఈమధ్య అవకాశాలు తగ్గాయి. దాంతో పెళ్లిదాకా వెళ్లి కాన్సిల్ అవడంతో ఇక సినిమాలపైనే దృష్టి సారించింది. తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న ఈమె వచ్చిన మంచి అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ‘నాయకి’ చిత్రంలో భయపెట్టడానికి రెడీ అయిన త్రిష, మరోవైపు ధనుష్‌తో ‘కోడి’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకున్న ఈమె, హిందీలో కూడా ఓ చిత్రంలో నటించింది. నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహితులమధ్య జరుపుకుంది.