మళ్లీ పరిగెత్తిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ని ‘ఓ బేబీ’ అనిపించి భారీ హిట్టందుకుంది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ. ఆ ఉత్సాహంతోనే మరో కొరియన్ మూవీ ‘మిడ్‌నైట్ రన్నర్స్’ను తెలుగు ఆడియన్స్‌కి అందించే ఆలోచన చేస్తోంది. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ దర్శకుడి చేతిలో పెట్టాలన్న ఆలోచన చేస్తోందట. లీడ్‌రోల్స్ కోసం రెజీనా, నివేతథామస్‌ను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్లను అద్భుతంగా డీల్ చేసే దర్శకుడు సుధీర్‌వర్మకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. సుధీర్‌వర్మ గత చిత్రం ‘రణరంగం’ మిస్‌ఫైర్ అయినా, యాక్షన్ కామెడీని డీల్ చేయడంలో సిద్ధహస్తుడు. సుధీర్‌వర్మకు ఈ ప్రాజెక్టు అప్పగిస్తే కచ్చితంగా న్యాయం చేయగలడన్న ఆలోచనను సురేష్ ప్రొడక్షన్స్ చేస్తోందన్న మాట వినిపిస్తోంది. అయితే, అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.